ఇండోర్ | నవంబర్ 23
టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన సంగీత్ వేడుకలో అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఆమె కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తో కలిసి అదిరిపోయే డ్యాన్స్ ప్రదర్శన కనబరిచారు. వీరి డ్యాన్స్ స్టెప్పులు మరియు కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది
స్మృతి సహచర క్రికెటర్లు ఈ వేడుకలో హాజరై సందడి చేశారు. వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్‌లో సూపర్ స్టార్‌గా మారిన జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తదితరులు డ్యాన్స్ ప్రదర్శనలతో వేడుకకు రంగు చేర్చారు. ఈ సందర్భంగా, ‘టీమ్ బ్రైడ్’ (వధువు జట్టు) మరియు ‘టీమ్ గ్రూమ్’ (వరుడు జట్టు) మధ్య ఫన్నీ క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన ‘టీమ్ బ్రైడ్’ విజయం సాధించింది. వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు అభిమానులు స్మృతి మంధానకు శుభాకాంక్షలు తెలిపారు.