శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MP Kesineni shivnath : బ్లూ మీడియాలో వంద తప్పుడు కథనాలు రాసినా భయపడేది లేదు : ఫతావుల్లా

    2 days ago

    విజయవాడ, ఫిబ్రవరి 4, 2026 :

    బ్లూ మీడియాలో తమపై వంద తప్పుడు కథనాలు ప్రచురించినా, ఎంతటి కేసులు పెట్టినా భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా స్పష్టం చేశారు. ఇకపై వైసీపీ నేతలు ఎవరైనా టీడీపీ నాయకులపై అసభ్య పదజాలంతో మాట్లాడితే వారి ఇంటి ముందుకు వెళ్లి శాంతియుతంగా ధర్నా చేసి ఆ భాష తప్పని తెలియజేస్తామని హెచ్చరించారు.

     

    బుధవారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్, ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫతావుల్లాతో పాటు టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా పాల్గొన్నారు.

     

     దేవినేని అవినాష్ వ్యాఖ్యలను ఖండించిన ఫతావుల్లా

     

    ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను ఫతావుల్లా తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేస్తే దాడి చేసినట్లుగా మాట్లాడటం కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. వైసీపీకి రాష్ట్రంలో ముస్లిం నాయకత్వం ఎదగకూడదనే దురుద్దేశం ఉందని ఆరోపించారు.

     

    టీడీపీలో ఉన్న ముస్లిం నాయకత్వాన్ని భయపెట్టేందుకే బ్లూ మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం నాయకుడు, ముస్లిం మహిళకు ధర్నా చేసే అర్హత లేదా అని వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు.

     

     ఎంపీ కేశినేని శివనాథ్‌పై విమర్శించే స్థాయి లేదు

     

    విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొందరికి కనిపించడం లేదన్నారు. అక్రమ వ్యాపారాలు చేసే మాఫియాలకు మాత్రమే అలాంటి అభివృద్ధి నచ్చదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్‌లను అసభ్య పదజాలంతో విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదన్నారు.

     

      మహిళా నాయకురాలిగా షేక్ ఆషా ఘాటు వ్యాఖ్యలు

     

    ఈ సందర్భంగా షేక్ ఆషా మాట్లాడుతూ, తాము జోగి రమేష్ ఇంటిపై దాడి చేయలేదని, కేవలం శాంతియుత ధర్నా కోసమే వెళ్లినట్లు స్పష్టం చేశారు. తాము 24x7 ఎంపీ కేశినేని శివనాథ్ అనుచరులమని బల్లగుద్ది చెప్పారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే వారి ఇళ్ల ముందే ధర్నా చేస్తామని హెచ్చరించారు.మై

    !నార్టీ నేతల పాల్గొనడం

     

    ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ఈస్ట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ కరీమ్, తెలుగు మహిళ నాయకురాలు నసీమా, పితాని పద్మ, నూరుద్దీన్, షేక్ సుభానీతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Priyanka's ONE major condition for Rajamouli’s Varanasi
    తర్వాత ఆర్టికల్
    U19 WC Semi-Final: Faisal, Niazai centuries power Afghanistan to 310/4 vs India

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి