శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Key Changes in MF Categorisation : మ్యూచువల్ ఫండ్ రంగంలో భారీ సంస్కరణలు.. లైఫ్ సైకిల్ ఫండ్స్‌కు సెబీ గ్రీన్ సిగ్నల్

    1 hour ago

    దేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో పారదర్శకత, సరళీకరణ లక్ష్యంగా Securities and Exchange Board of India (సెబీ) కీలక సంస్కరణలు చేపట్టింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎంఎఫ్ పథకాలను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్ సైకిల్, ఇతర పథకాలుగా ఐదు విభాగాలుగా వర్గీకరించింది. రిటైర్మెంట్, పిల్లల విద్య వంటి అవసరాల కోసం ఉన్న సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌ను నిలిపివేసి, వాటి స్థానంలో లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లను ‘ఇతర’ కేటగిరీలో చేర్చింది. అలాగే కొత్త పెట్టుబడులను తక్షణమే ఆపి, అవసరమైతే సమాన రిస్క్ ప్రొఫైల్ ఉన్న ఇతర పథకాలతో విలీనం చేయాలని ఆదేశించింది.

    లైఫ్ సైకిల్ ఫండ్స్ కాలపరిమితి 5 నుంచి 30 ఏళ్ల వరకు ఉండగా, కాలక్రమేణా ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించి రుణ పత్రాల్లో పెంచే విధానాన్ని అనుసరిస్తాయి. పథకాల పేర్లలో రాబడుల ప్రస్తావన చేయకూడదని, ప్రతి పథకం తన కేటగిరిని స్పష్టంగా పేర్కొనాలని సెబీ స్పష్టం చేసింది. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తమ నిధుల్లో కనీసం 95 శాతం సంబంధిత సూచీలోని సెక్యూరిటీల్లోనే మదుపు చేయాలి. ఈ చర్యలతో రిటైల్ మదుపరులకు పెట్టుబడుల ఎంపిక మరింత స్పష్టంగా, సులభంగా మారనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Umar Akmal clears air over post on Babar Azam: 'Not comparing myself with him'
    తర్వాత ఆర్టికల్
    Jim Carrey makes a public appearance with girlfriend Minzi

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి