శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Foods That Protect Your Stomach : అజీర్తి, మలబద్ధకానికి ఆహారమే కారణం… నివారణకు ఇంటి చిట్కాలే పరిష్కారం

    1 hour ago

    అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం మన ఆహార అలవాట్లే. ఏ ఆహారాన్ని అతిగా తీసుకున్నా కడుపు సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పాలు ఎక్కువైతే అన్నం వడికించిన నీళ్లు (గంజి నీరు) తాగితే ఉపశమనం కలుగుతుంది. మామిడి ఎక్కువైతే వేడి పాలు విరుగుడుగా పనిచేస్తాయి. నెయ్యి, నూనె పదార్థాలు అధికమైతే నేరేడు పళ్ల రసం లేదా నిమ్మరసం మంచివి.

    ఉప్పు, నిమ్మరసం వంటి పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు గంజి లేదా అంబలి ఉపశమనాన్ని ఇస్తాయి. పాలు, పాల పదార్థాలు ఎక్కువైతే మజ్జిగ ఉత్తమ పరిష్కారం. మినప, పెసర, శనగ, మైదా పదార్థాలు అధికమైతే వేడి నీళ్లు తాగడం మంచిది. చేపలు ఎక్కువైతే మామిడి రసం, మాంసం అధికమైతే బియ్యపు జావ ఉపశమనం ఇస్తాయి.

    అరటిపండ్లు, పనస, రేగు పండ్లు, నారింజ వంటి పండ్లను అతిగా తీసుకున్నప్పుడు కూడా సరైన విరుగుడులు ఉన్నాయి. అరటికి కొద్దిగా నెయ్యి-పంచదార, పనసకు అరటి, పుల్లని పండ్లకు అంబలి ఉపశమనాన్ని ఇస్తాయి. వెల్లుల్లి ఎక్కువైతే మరిగించి చల్లార్చిన పాలు ఇవ్వాలి. మద్యపానం అధికమైతే తేనె కలిపిన నీరు విరుగుడుగా పనిచేస్తుంది.

    ప్రతిరోజూ ఉదయం అంబలి తాగడం కేవలం కడుపు నింపుకోవటానికే కాదు, శరీరంలోని విషదోషాలను తొలగించడానికీ ఉపయోగకరం. చిరుధాన్యాలు తిన్నప్పుడు పలుచని మజ్జిగ తీసుకోవడం మంచిది. ఆకుకూరలు వండేటప్పుడు ఆవాలు వేసి తినడం జీర్ణానికి సహాయపడుతుంది.

    ఆరోగ్యకర వంటకం: పాలకూర కూర

    పాలకూర, ఉల్లి, టమాటా, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వంటి పదార్థాలతో చేసే ఈ వంటకం జీర్ణానికి మంచిది. మసాలాలు తగిన మోతాదులో వేసి వండితే రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.

    ప్రత్యేక వంటకం: బొప్పాయి హల్వా

    బొప్పాయి ప్యూరీ, కస్టర్డ్ పొడి, పాలు, చక్కెర, నెయ్యితో తయారుచేసే ఈ హల్వా రుచికరమైనది. బాగా కలుపుతూ ఉడికించి ట్రేలో వేసి ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. ఎండు కొబ్బరి పొడిలో అద్దితే మరింత రుచిగా ఉంటుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    After 20 years, Paresh Rawal confirms Malamaal Weekly 2
    తర్వాత ఆర్టికల్
    Adulterated Ginger Garlic Paste: अदरक-लहसुन का मिलावटी पेस्ट सेहत के लिए कितना खतरनाक, किन अंगों को सड़ा देता है यह?

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి