శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    on’t Peel the Power Surprising Health Benefits of Eating Kiwi Skin కివీ తొక్క తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

    1 hour ago

    విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లలో కివీ ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఈ పండు గుజ్జులోనే కాదు, పై తొక్కలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. చాలామంది తొక్కను తీసేసి తింటారు గానీ, తొక్కతో సహా తినడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని లాభాలు కలుగుతాయి.

    1. జీర్ణక్రియకు మేలు

    కివీ తొక్కలో అధిక పీచు పదార్థం ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

    2. రోగనిరోధక శక్తి పెంపు

    కివీ తొక్కలో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. యాంటీ మైక్రోబియల్ గుణాలు హానికర బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.

    3. మెరిసే చర్మం

    తొక్కలోని పోషకాలు చర్మం పొడిబారకుండా చూసి వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడతాయి. కొందరు దీనిని సహజ ఫేస్ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. చర్మానికి సహజ మెరుపు అందిస్తుంది.

    4. దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ

    ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కివీ తొక్క సహాయపడుతుంది.

    5. పర్యావరణానికి మేలు

    పండును పూర్తిగా తొక్కతో సహా తినడం వల్ల ఆహార వృథా తగ్గుతుంది. ఇది పర్యావరణ పరిరక్షణకు మనం చేసే చిన్న కానీ ముఖ్యమైన సహకారం.

    కివీ తొక్కపై ఉండే పీచు తొలగించే విధానం

    చాలామంది పీచు కారణంగా తొక్క తినడానికి ఇష్టపడరు. కానీ సులభంగా శుభ్రం చేయవచ్చు. పండును తినే ముందు వెజిటబుల్ బ్రష్ లేదా గరుకుగా ఉన్న గుడ్డతో మెల్లగా రుద్ది కడిగితే పీచు తగ్గుతుంది. సాధారణ కివీ కంటే గోల్డెన్ కివీ తొక్క పలుచగా ఉండి పీచు తక్కువగా ఉంటుంది.

    మొత్తానికి, కివీని తొక్కతో సహా తినడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    EPF Inoperative Accounts Update: EPFO To Credit Rs 1,000 Or Less Automatically
    తర్వాత ఆర్టికల్
    SS Rajamouli and Mahesh Babu engage in a massive fight?

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి