kntv
kntv

Megastar Impressed by Charan’s Energy ‘రై రై రారా’ సాంగ్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం – చరణ్ ఎనర్జీకి మెగాస్టార్ ఫిదా

1 week ago

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌లో Ram Charan స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా హైలెట్ అవుతోంది. పాటపై మెగాExtra 5752స్టార్ Chiranjeevi ప్రశంసలు కురిపిస్తూ, “రై రై రారా సాంగ్ తెరపై అక్షరాలా అగ్ని జ్వాలలా ఉంది. ఎనర్జీ, ఎమోషన్, సినీమాటిక్ బ్రిలియన్స్ అద్భుతంగా మిళితమయ్యాయి” అని పేర్కొన్నారు. చరణ్ తన సహజ గ్రేస్, మెరుపు వేగంతో స్క్రీన్‌ను వెలిగించాడని, అతని డ్యాన్స్ చూడటం ప్రత్యేక అనుభూతి అని కొనియాడారు. ఈ సాంగ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టెక్నికల్ టీమ్‌పై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. దర్శకుడు Buchi Babu Sana, సంగీత దర్శకుడు A. R. Rahman, కొరియోగ్రాఫర్ Jani Master, సినిమాటోగ్రాఫర్ R. Rathnavelu, సాహిత్య రచయిత Ananta Sriram, నిర్మాత వెంకట్ సతీష్ కిలారు విజన్‌ను మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు.