శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MAHESHBABU VARANASI : మహేష్–రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్

    1 week ago

    • 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

    హైదరాబాద్, జనవరి 30:
    సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ పై సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  గత కొద్ది రోజులుగా ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. వారణాసిలో కొన్ని చోట్ల హోర్డింగ్స్ ఏర్పాటు చేశారన్న పోస్టులు వైరల్‌గా మారాయి. చివరికి అభిమానులు ఊహించినట్లుగానే అదే తేదీని మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

     

    వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మహేష్–రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘వారణాసి’ పై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ప్రకటనతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలైంది. ‘వారణాసి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Nipah Virus: शरीर में 45 दिनों तक साइलेंटली रह सकता है निपाह वायरस, जानें कब हो जाता है खतरनाक?
    తర్వాత ఆర్టికల్
    Mardaani 3 cast fees: Rani gets 14x more than Mallika Prasad

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి