శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Antrivedi : అంతర్వేదిలో అంకురార్పణ ఘనంగా నిర్వహణ

    1 వారం క్రితం

     అంతర్వేది | వెబ్ న్యూస్

    అంతర్వేదిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అంకురార్పణతో ఏడు రోజుల ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.

     

    ఈ సందర్భంగా ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ లను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు నిర్వహించారు. అనంతరం పుట్ట మన్నును తీసుకువచ్చి, అందులో  నవధాన్యాలను చల్లి సర్వ దేవతలను ఆవాహన చేశారు. ఈ నవధాన్యాల నుంచి మొక్కలు ఎంత ఏపుగా ఎదుగుతాయో, అంతమేర గ్రామాలు పాడిపంటలతో సుభిక్షంగా ఉంటాయని భక్తుల విశ్వాసం.

     

    నరసింహ స్వామి వారి కల్యాణానికి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ గరుత్మంతుని ద్వారా చరాచర సృష్టిని ఆహ్వానించే సంప్రదాయంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులకు కనులపండువగా సాగింది.

     

    అనంతరం ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరేయడం (ధ్వజారోహణ) జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవగణాలు, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ వేద మంత్రోచ్ఛారణలతో ధ్వజారోహణ నిర్వహిస్తామని తెలిపారు.

     

    కల్యాణోత్సవాలకు ఎటువంటి దుష్టశక్తుల అవరోధాలు లేకుండా ఉండేందుకు ధ్వజారోహణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి మామిడి ఆకులు, దర్భలు కట్టి, గరుత్మంతుని చిత్రం గీసిన వస్త్రాన్ని అర్చకులు ఎగరేశారు.

     

    ఉత్సవాల నిమిత్తం ఆలయానికి విచ్చేసే భక్తులకు రక్షణ కల్పించేందుకు గరుత్మంతుడు భగవానున్ని వేడుకునే ప్రతీకగా ధ్వజస్తంభం, గరుడ పటం అలంకరించి,మంగళవాయిద్యాల నడుమ మంత్రజపాలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

     

    అంతర్వేదిలో జరుగుతున్న ఈ ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ICC U19 World Cup 2026 Live Score: Pakistan vs New Zealand
    తర్వాత ఆర్టికల్
    Peter Napolitano passes away; tributes pour in from fans

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి