శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Shani Trayodashi : శని త్రయోదశి: శనిదేవుని కృపకు అత్యంత శుభదినం

    6 రోజులు క్రితం

     శని త్రయోదశి విశిష్టత

    హిందూ ధర్మంలో శనిదేవునికి అతి ప్రీతికరమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి. అమావాస్యకు ముందురోజు వచ్చే త్రయోదశి తిథి శనివారంతో కలిసినప్పుడు దీనిని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ రోజు శనిదేవుని ఆరాధన చేస్తే శని దోషాలు తగ్గి, కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

     శనిదేవుని ఆరాధన ఎందుకు ముఖ్యము?

    శనిదేవుడు కర్మఫలదాత. మన చేసిన కర్మల ఆధారంగా ఫలితాలను అందించే దేవుడిగా ఆయన్ని భావిస్తారు. శని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు జీవితంలో ఆలస్యాలు, అవరోధాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. అలాంటి సమయంలో శని త్రయోదశి నాడు భక్తితో పూజ చేస్తే శనిదేవుని కటాక్షం లభిస్తుందని విశ్వాసం.

     శని త్రయోదశి పూజ విధానం

    ఉదయాన్నే నూనె స్నానం చేయడం శుభకరం, నల్లని వస్త్రాలు ధరించడం. శనిదేవుని ప్రతిమ లేదా చిత్రానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. నల్ల నువ్వులు, ఉలవలు, ఇనుము దానం చేయడం. “ఓం శం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని జపించడం

     శని త్రయోదశి నాడు చేయాల్సిన దానాలు

    శని త్రయోదశి నాడు చేసే దానాలకు ప్రత్యేక ఫలితం ఉంటుంది. నల్ల దుస్తులు. నువ్వుల నూనె, పేదలకు అన్నదానం. వృద్ధులు, వికలాంగులకు సహాయం, ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.

     శని త్రయోదశి ఫలితాలు

    శని సాడే సాతి, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత, జీవితంలో స్థిరత్వం, విజయ మార్గం శని త్రయోదశి అనేది భయపడాల్సిన రోజు కాదు, శనిదేవుని అనుగ్రహాన్ని పొందే మహత్తర అవకాశం. భక్తి, నియమం, దాన ధర్మాలతో ఈ రోజును గౌరవిస్తే శని దేవుడు తప్పకుండా కటాక్షిస్తాడని శాస్త్ర విశ్వాసం.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Gold Prices Continue To Fall (Jan 31), Check 22K & 24K Rates Per Gram In Your City
    తర్వాత ఆర్టికల్
    US government enters partial shutdown after Congress fails to pass 2026 budget

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి