శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kcr : ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు

    5 రోజులు క్రితం

    హైదరాబాద్, ఫిబ్రవరి 1:

    ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఈ విచారణ కొనసాగుతోంది.

     

    నందినగర్ నివాసంలోని రెండో అంతస్తులో సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణను వీడియో రికార్డు చేస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

     

    ఈ విచారణలో ఎస్‌బీ జాయింట్ సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్ పాల్గొంటున్నారు.

     

    కేసీఆర్ విచారణ సమయంలో తన న్యాయవాది సంతోష్ రావును పక్కన ఉంచేందుకు అనుమతించాలని ఆయన న్యాయవాది రాంచందర్ రావు సిట్ అధికారులను కోరారు.

     

    ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారడంతో, ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    22-year-old Alcaraz wins his maiden AO title after outfoxing Djokovic
    తర్వాత ఆర్టికల్
    Lee Chung Ah worked right after car accident injury

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి