శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Telangana Government : మున్సిపల్ ఎన్నికలకు ముందే సంచలన నిర్ణయం రెడ్డి గాండ్ల సహా 26 కులాలకు BC రిజర్వేషన్లు రద్దు

    1 వారం క్రితం

    హైదరాబాద్, జనవరి 30:
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్డి గాండ్ల సహా మరో 26 వెనుకబడిన తరగతుల (BC) కులాలను బీసీ జాబితా నుంచి తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాల వారు బీసీ రిజర్వేషన్ల కింద పోటీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా రిజర్వేషన్ ప్రయోజనాలను అక్రమంగా పొందుతున్నారనే ఫిర్యాదులు భారీగా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అర్హత లేని కొంతమంది సులభంగా బీసీ సర్టిఫికెట్లు పొంది ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు ప్రభుత్వ ప్రయోజనాలను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపాయి.

     

    ఈ నేపథ్యంలో రెడ్డి గాండ్ల కులానికి చెందిన వారికి బీసీ-బి (BC-B) సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గత పదేళ్లుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ కులానికి చెందిన వారికి బీసీ సర్టిఫికెట్లు జారీ అవుతుండగా, ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ వ్యవస్థ పవిత్రతను కాపాడటంతో పాటు, నిజమైన అర్హులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    USA announce squad for T20 World Cup 2026
    తర్వాత ఆర్టికల్
    WPL: Mumbai Indians face Gujarat Giants in a must-win playoff encounter

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి