శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Karpuram : ఈగలు, దోమలు, బొద్దింకల బెడదతో విసిగిపోయారా?

    3 రోజులు క్రితం

    ఒక్క కర్పూరంతో సహజసిద్ధ పరిష్కారం ఇదే..

     

    ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకలు ఎక్కువవుతున్నాయా? రసాయనాలతో నిండిన స్ప్రేలు వాడాలనిపించడం లేదా? అయితే పూజల్లో ఉపయోగించే కర్పూరం మీ సమస్యకు చక్కటి పరిష్కారం కావచ్చు.

     

    కర్పూరంతో బొద్దింకలకు చెక్

     

    వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా సింక్‌, పైపుల దగ్గర దాక్కుంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం.

     కర్పూరం ముక్కలను టిష్యూ పేపర్ లేదా పలుచని గుడ్డలో చుట్టి కిచెన్‌లో ఉంచండి.

     కర్పూరం వాసనను బొద్దింకలు భరించలేవు. వెంటనే అవి పారిపోతాయి.

     

     దోమలు, ఈగలు దూరం కావాలంటే

     

    కర్పూరం పొగ దోమలు, ఈగలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

    దోమలు ఎక్కువగా ఉన్న చోట కర్పూరం వెలిగించి ఉంచండి.

     కర్పూరం వాసన వల్ల దోమలు, ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

     అదనంగా ఇంట్లో మంచి సువాసన కూడా వస్తుంది.

     

     కర్పూరం వాడే మరికొన్ని చిట్కాలు

     

    స్ప్రే విధానం:

    రెండు కర్పూరాలను నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి, మూలలు, పడక దగ్గర, తలుపులు–కిటికీల వద్ద స్ప్రే చేయండి. దోమలు దూరంగా ఉంటాయి.

     

    దీపం పద్ధతి:

    దీపంలో వేప నూనె పోసి కర్పూరం వెలిగించండి. తలుపులు, కిటికీల దగ్గర పెట్టితే ఈగలు, దోమలు లోపలికి రావు.

     

    ఇంటి శుభ్రతలో కర్పూరం:

    ఇంటిని తుడిచే నీటిలో కర్పూరం పొడి కలిపి ఉపయోగించండి.కీటకాలు తగ్గడమే కాకుండా ఇంటంతా సువాసనగా మారుతుంది.

     

      రసాయనాల అవసరం లేకుండా సహజ పరిష్కారం

     

    ఇలా కర్పూరం వాడటం వల్ల ఖరీదైన రసాయన స్ప్రేలు అవసరం లేకుండా, ఈగలు, దోమలు, బొద్దింకల సమస్య నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Unsold in IPL, Australia great joins PSL team for debut campaign
    తర్వాత ఆర్టికల్
    CMA Hails Union Budget 2026, Sees Long-Term Boost For Cement Industry

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి