శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Positive energy : ఇంట్లో పూజ – ఏవి చేయాలి, ఏవి చేయకూడదు

    3 రోజులు క్రితం

    ఇంట్లో పూజ – ఏవి చేయాలి, ఏవి చేయకూడదు

     

    మనము భక్తితో ఆరాధించే దేవతలే అయినా,

    విధి–విధానాలు పాటించలేని పరిస్థితుల్లో కొన్ని విగ్రహాలు లేదా ఫోటోలు ఇంట్లో ఉంచడం గృహస్థులకు అనుకూలం కాదు అని శాస్త్రాలు చెబుతాయి.

    అలాగే, కొన్ని ఆచరణలు ఇంటికి శుభఫలితాలను తీసుకువస్తాయి.

     

    ఈ వ్యాసంలో ఇంట్లో పూజకు సంబంధించిన ముఖ్యమైన నియమాలు, జాగ్రత్తలు, సంప్రదాయాలు సులభంగా తెలుసుకుందాం.

     

     1. హనుమంతుడు

     

    పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడు గానీ

     హనుమంతుడి విగ్రహం / ఫోటో గానీ ఉంచకూడదు

     

     2. సూర్యుడు

     

     సూర్య విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు

     ఆయనే ప్రత్యక్ష దైవం – నేరుగా నమస్కరించడమే శ్రేయస్కరం

     

     

     3. నరసింహ స్వామి

     

    ఉగ్ర నరసింహ రూపం ఫోటోలు/విగ్రహాలు వద్దు

     లక్ష్మీ నరసింహ

     యోగ నరసింహ

     ప్రహ్లాద అనుగ్రహ నరసింహ – ఇవి అనుకూలం

     

     4. కృష్ణుడు

     

     చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణ విగ్రహం ఇంట్లో ఉండకూడదు

    చిన్న పరిమాణంలో బాలకృష్ణుడు లేదా ఫోటో ఉంచవచ్చు

     

     

     5. పూజ గదిలో గవ్వలు ఎందుకు?

     

     గవ్వలు దిష్టి నివారణకు శక్తివంతమైనవి

    లక్ష్మీ దేవి ఫోటో ముందు

     

       చిన్న వెండి గిన్నెలో బియ్యం

       అందులో కొన్ని గవ్వలు ఉంచాలి

     పూజ గది కళకళలాడేలా ఉంటుంది

     

     

     6. కాళికా & ప్రత్యంగిరా దేవి

     

     భయపడాల్సిన అవసరం లేదు

     ఉగ్ర రూపం దుష్టశక్తులను దూరం చేస్తుంది

     స్తోత్రం, అష్టోత్తరంతో పూజ చేయాలి

     తాంత్రిక మంత్రాలు వద్దు

     

     

     7. విగ్రహ పరిమాణం

     

    చిన్న విగ్రహం – సాధారణ పూజ సరిపోతుంది

    పెద్ద విగ్రహం 

     

      నిత్య నివేదన

       వారానికి ఒకసారి అభిషేకం తప్పనిసరి

     

     8. నటరాజ స్వామి

     

    ఇంట్లో ఉంచకూడదు

    నాట్య శిక్షణ ఇచ్చే ప్రదేశాల్లో మాత్రమే శుభం

     

     9. ఇంటి గుమ్మం

     

     రాక్షస ఫోటోలు వద్దు

     వినాయకుడు

     దిష్టి యంత్రం

     కాళీ పాదముద్ర – శ్రేయస్కరం

     

     

     10. పూజ విగ్రహాలను తొలగించాల్సి వస్తే

     

     ఆటకపైన పెట్టకూడదు

     సెల్ఫ్‌లో ఉంచి హారతి ఇవ్వాలి

     లేదా గుడిలో ప్రతిష్ఠించాలి

     

    11. వినాయకుడి తొండం

     

    ఇల్లు → ఎడమ వైపు

    విద్యాలయం → కుడి వైపు

     వ్యాపార స్థలం →నిల్చుని ఉన్న వినాయకుడు

     

     12. లక్ష్మీ దేవి

     

     నిల్చున్న లక్ష్మీ ఫోటో ఇంట్లో వద్దు

     పచ్చ చీర

     రెండు ఏనుగులు ఉన్న ఫోటో – అత్యంత శుభం

     

     13. నైవేద్యం

     

    పూజ తర్వాత వెంటనే తీసి

    ప్రసాదంగా స్వీకరించాలి

     

     

     14. పూజ గది గోడ సంప్రదాయం

     

    వైష్ణవులు → తిరునామాలు

     శైవులు → విభూతి నామాలు

     శక్తేయులు → గౌరీ తిలకం

      ఖరీదైన విగ్రహాలకంటే ఇది ముఖ్యం

     

     15. దీపారాధన ఫలితాలు

     

     కొబ్బరి నూనె → అప్పుల బాధలు

     ఆముదం → గొడవలు తగ్గుతాయి

    ఆవునెయ్యి → నిత్య లక్ష్మీ కటాక్షం

     నువ్వుల నూనె → శత్రు పీడ నివారణ

     

     

      16–19. గుడి & శాస్త్ర నియమాలు (సారాంశం)

    బలిపీఠం తాకకూడదు.నవగ్రహాలు తాకి మొక్కకూడదు.కొన్ని తిథుల్లో నూనె స్నానం వద్దు

    రాత్రి తల దువ్వకూడదు

     

    22. ఆహార సంస్కారం

     

    ఆకలితో నిద్రపోకూడదు వంట చేస్తూ, తింటూ తిట్టుకోకూడదు.సంతోషంగా వండితే – సంతోషమే ఫలితం

     

     28–30. గృహ ధర్మాలు

     

     ఒట్టి చేతితో ఎవరి ఇంటికీ వెళ్లకూడదు అతిథికి ముందు మనం తినకూడదు పిల్లలు చూసే చోట ఇంటి దైవ ఫోటో ఉండాలి

     

     32. సాంబ్రాణి

    ఇంట్లో తరచూ వేయాలి  నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.గాలి శుద్ధి అవుతుంది

     

    ఇవి భయపెట్టే నియమాలు కాదు —

    సంతోషంగా, శాంతిగా జీవించేందుకు పెద్దలు ఇచ్చిన మార్గదర్శకాలు.అన్నీ చేయలేకపోయినా, తెలిసి ఉండడం itself ఒక పుణ్యం.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Delhi High Court orders Rajpal Yadav to surrender
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup: 'India vs Pakistan presented as war now,' says J&K CM Omar Abdullah

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి