శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Devotional: స్త్రీలకు షోడశ ఉపచార పూజపై శాస్త్రీయ స్పష్టత – అపోహలను తొలగించిన ఆచార వివరణ

    1 వారం క్రితం

    హిందూ సంప్రదాయ పూజా విధానాల్లో ముఖ్యమైన షోడశ ఉపచార పూజ విషయంలో స్త్రీల పాత్రపై ఉన్న అపోహలకు శాస్త్రీయ స్పష్టత లభిస్తోంది. శాస్త్రాల ప్రకారం స్త్రీలకు పూజ చేయడంలో అర్హతా లోపం లేదని, క్రమం, శుద్ధి, పరిమితులు పాటిస్తే పూజ సంపూర్ణమవుతుందని పండితులు వివరిస్తున్నారు.*

     

     *షోడశ ఉపచార పూజ అంటే ఏమిటి?*

     

    షోడశ ఉపచారాలు అనేవి దేవుడిని అతిథిగా భావించి చేసే 16 సేవలు. ఇవి శాస్త్రాలలో నిర్ధిష్టంగా చెప్పబడిన క్రమంలోనే నిర్వహించాలి. ఈ క్రమంలో మార్పులు చేయడం పూజను అపూర్ణం చేస్తుందని ఆచార నిపుణులు చెబుతున్నారు.

     

    *షోడశ ఉపచారాల క్రమం*

     

    ఆవాహనం నుండి మంత్రపుష్పం లేదా నమస్కారం వరకు మొత్తం 16 ఉపచారాలు ఉంటాయి. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, నమస్కారం — ఇవే సంపూర్ణ క్రమం.

     

    *స్త్రీలు షోడశ ఉపచార పూజ ఎలా చేయాలి?*

     

    శాస్త్రాల ప్రకారం స్త్రీలు పూజ చేయడానికి ప్రత్యేక వేద సంకల్పం అవసరం లేదు. భక్తితో సంకల్పం చేస్తే చాలు. మంత్రాలు రాకపోతే “ఓం నమః” అన్న భావన సరిపోతుంది. అనేక ఉపచారాలు ప్రతీకాత్మకంగా చేయవచ్చు.

     

    అభిషేకం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. గృహస్థ స్త్రీలు స్వయంగా అభిషేకం చేయకుండా, నీరు అర్పిస్తూ భావన చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

     

     *నైవేద్యం, దీపారాధనలో నియమాలు*

     

    నైవేద్యంగా తప్పనిసరిగా వండిన ఆహారమే అవసరం లేదు. పండు, పాలు, చక్కెర సరిపోతాయి. అయితే నైవేద్యాన్ని రుచి చూడకూడదన్న నియమం తప్పనిసరి. దీపారాధన మాత్రం కుడిచేతితోనే చేయాలి.

     

    *స్త్రీలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు*

     

    * రజస్వల స్థితిలో పూజ చేయరాదు

    * రాత్రి 10 గంటల తర్వాత దీర్ఘ పూజలు చేయకూడదు

    * ఉగ్ర దేవతలకు తంత్ర–మంత్ర పూజలు చేయరాదు

    * దీక్షలు, హోమాలు, అభిషేకాలు స్వయంగా చేయకూడదు

     

    *భావమే ప్రధానమని శాస్త్రాల స్పష్టం*

     

    స్త్రీల పూజలో శబ్దం, క్రియ కంటే భావమే ప్రధానమని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అంతరంగ శుద్ధి, భక్తి, నియమపాలనే పూజకు ప్రాణమని పండితులు పేర్కొంటున్నారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    U19 WC: Kundu departs on 61, ending 113-run partnership with Vihaan
    తర్వాత ఆర్టికల్
    Budget 2026: What five years of data shows about roadways spending

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి