శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MS Dhoni Latest Comments: టీ20 వరల్డ్ కప్ 2026: భారత్ హాట్ ఫేవరేట్

    2 రోజులు క్రితం

    టీ20 ప్రపంచకప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతోంది. సన్నాహక మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం చూపిన టీమిండియా, ఈసారి కప్‌కు హాట్ ఫేవరేట్‌గా నిలిచింది.

     

    ఈ నేపథ్యంలో భారత జట్టుపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ధోని, ప్రస్తుత భారత జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటని స్పష్టం చేశాడు.

     

    “మంచి జట్టుకు కావాల్సిన అన్ని లక్షణాలు ఈ టీమిండియాలో ఉన్నాయి. ఆటగాళ్లందరికీ అపార అనుభవం ఉంది. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌లో అనుభవమే అత్యంత కీలకం. ఒత్తిడిలో ఆడిన అనుభవం వీరికి ఉంది. ఎవరు ఏ పాత్ర పోషించాలో వారికి బాగా తెలుసు. అందుకే ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది” అని ధోని ప్రశంసించాడు.

     

    అయితే ఒక్క విషయంలో మాత్రం భారత జట్టు అప్రమత్తంగా ఉండాలని ధోని హెచ్చరించాడు. అదే డ్యూ (మంచు).

     

    “డ్యూ అంటే నాకు అస్సలు నచ్చదు. అది మ్యాచ్‌ను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. నేను ఆడే రోజుల్లో కూడా డ్యూ గురించి భయపడేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే నాకు ఆందోళన కలిగించే అంశం” అని ధోని వ్యాఖ్యానించాడు.

     

    ధోని వ్యాఖ్యలతో, టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు బలంతో పాటు ఎదురయ్యే సవాళ్లపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. మరి ఈసారి టీమిండియా కప్‌ను ముద్దాడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Bridgerton Season 4: This new theory about Sophie Baek’s birth actually makes sense and changes everything for Benedict
    తర్వాత ఆర్టికల్
    Kamal Kakdi Benefits: युवाओं की पहली पसंद बन रही कमल ककड़ी, जानें इसे खाकर कैसे घटा सकते हैं अपना वजन?

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి