శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Minister acham Naidu : వ్యవసాయ, అనుబంధ శాఖలకు అదనపు నిధులు కేటాయించాలి

    2 రోజులు క్రితం

    అమరావతి, ఫిబ్రవరి 04:

    2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్ గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్ కూర్పు, వ్యవసాయ రంగానికి అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు.

     

    రాష్ట్ర రైతాంగానికి బలమైన మద్దతుగా నిలిచేలా వ్యవసాయ, అనుబంధ శాఖల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆర్థిక మంత్రిని కోరారు. ముఖ్యంగా రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ ఉత్పాదకత వృద్ధి, ఆధునిక సాంకేతికత అమలు, పశుసంవర్థక రంగ విస్తరణ వంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

     

    అలాగే రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల పరిధిలో కీలకమైన కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, కొనసాగుతున్న మరియు ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు అదనపు నిధులు అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్థక మరియు అనుబంధ శాఖలకు అదనపు బడ్జెట్ కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

     

    ఈ విజ్ఞప్తికి ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్  సానుకూలంగా స్పందించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ మరియు పశుసంవర్థక రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. రాబోయే బడ్జెట్‌లో ఈ రంగాలకు తగిన నిధులు కేటాయించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    5 most expensive buildings from across the world and why they cost so much
    తర్వాత ఆర్టికల్
    Indians second most optimistic about economy

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి