శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Acne And Pigmentation : మొటిమలు, పిగ్మెంటేషన్, నల్ల మచ్చలతో విసిగిపోయారా

    6 రోజులు క్రితం

    ఈ రోజుల్లో మొటిమలు, పిగ్మెంటేషన్, నిర్జీవమైన చర్మం, అసమాన చర్మపు రంగు వంటి సమస్యలు చాలా సాధారణమయ్యాయి. పొల్యూషన్, సరైన ఆహారం లేకపోవడం, హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి వంటి కారణాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. నల్ల మచ్చలు, మొటిమలు ఎవరికీ నచ్చవు. అందుకే చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, ప్రొడక్ట్స్‌పై ఆధారపడుతున్నారు.

    కానీ, ఇవి తాత్కాలిక ఫలితాలు మాత్రమే ఇస్తాయని, దీర్ఘకాలికంగా మరిన్ని చర్మ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చర్మ సమస్యలను లోపలి నుంచే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.

     చర్మాన్ని లోపలి నుంచి డిటాక్స్ చేసే కషాయం

    రమితా కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో చర్మ సమస్యలకు ఓ సహజ పరిష్కారాన్ని సూచించారు. ఈ కషాయం శరీరాన్ని నిర్విషీకరణ చేసి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

     కావాల్సిన పదార్థాలు

    నీరు – 2 కప్పులు

    వేపాకులు – 4 నుంచి 5

    తులసి ఆకులు – 4 నుంచి 5

    పచ్చి పసుపు – చిన్న ముక్క

    నల్ల మిరియాలు – 3 నుంచి 4

     తయారీ విధానం

    ముందుగా ఒక పాన్‌లో రెండు కప్పుల నీరు పోసి తక్కువ మంట మీద మరిగించాలి. ఇప్పుడు వేపాకులు, తులసి ఆకులు, పచ్చి పసుపు, నల్ల మిరియాలు వేసి బాగా కలపాలి.
    నీరు సగం అయ్యే వరకు తక్కువ మంట మీద మరిగించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా తాగాలి.

     ఈ కషాయం వల్ల లాభాలు

    వేపాకులు:
    యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.

    తులసి ఆకులు:
    శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

    పచ్చి పసుపు:
    కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండటం వల్ల మంటను తగ్గించి, చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది.

    నల్ల మిరియాలు:
    పసుపు శోషణను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

     క్రమం తప్పకుండా తీసుకుంటే…

    మొటిమలు తగ్గుతాయి

    నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయి

    రక్తం శుద్ధి అవుతుంది

    చర్మం స్పష్టంగా, కాంతివంతంగా మారుతుంది

     ముఖ్య సూచనలు

    ఈ కషాయాన్ని ఉదయం లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. అయితే,  గర్భిణీ స్త్రీలు, తీవ్రమైన వైద్య సమస్యలు ఉన్నవారు. తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ కషాయాన్ని వినియోగించాలి.

    రసాయనాలతో కూడిన ఉత్పత్తులను దూరం పెట్టి, సహజంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలనుకునేవారికి ఈ కషాయం ఒక మంచి ఆప్షన్. లోపలి నుంచి శరీరాన్ని శుభ్రం చేస్తే… దాని ప్రభావం మీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Gold, Silver Prices Swing: Why Precious Metals See Volatility | Details Inside
    తర్వాత ఆర్టికల్
    Salman REACTS to trolling over his look in 'Battle of Galwan'

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి