శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Indian women's cricket team : ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సింధు ఔట్, భారత మహిళల జట్టుకు కఠిన సవాల్

    3 days ago

     

    బారత మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా స్టార్ షట్లర్ పీవీ సింధు టోర్నీ నుంచి తప్పుకోవడంతో జట్టుకు పెద్ద లోటుగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది.

     

    సింధు స్థానాన్ని 17 ఏళ్ల యువ షట్లర్ తన్వీ శర్మ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో తన్వీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, మాళవిక బన్సోడ్, రక్షిత శ్రీ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు.

     

    మహిళల డబుల్స్ విభాగంలో ట్రీసా జాలీ–గాయత్రి గోపిచంద్ జోడీపై ప్రధాన బాధ్యతలు ఉండగా, ప్రియ, శ్రుతి, తనీషా కూడా పోటీలోకి దిగనున్నారు. భారత్ గ్రూప్–వైలో భాగంగా ఉండగా, బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో మలేసియాతో తలపడనుంది.

     

    ఇక పురుషుల విభాగంలో సింగిల్స్‌లో లక్ష్య సేన్, తరుణ్, కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్, ఆయుష్ పోటీపడనున్నారు. డబుల్స్‌లో ప్రపంచ స్థాయి జోడీ సాత్విక్‌సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, సాయి ప్రతీక్, పృథ్వీ కృష్ణమూర్తి, హరిహరన్ ఇతర ఆటగాళ్లు.

     

    పురుషుల జట్టు గ్రూప్–సిలో భాగంగా ఉండి సింగపూర్, జపాన్ జట్లతో తలపడనుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్–2 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

     

    సింధు లేకపోయినా యువ ఆటగాళ్లపై భారత జట్టు ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీ యువ షట్లర్లకు తమ సత్తా చాటుకునే కీలక వేదికగా మారనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Bencic, Svitolina rewrite history as first mothers inside WTA top 10
    తర్వాత ఆర్టికల్
    Gold, silver price prediction today: Where are gold, silver prices headed after worst decline since 1980?

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి