kntv
kntv

దళిత సంఘాల ఐక్యవేదిక మాజీ ఉప ప్రధాని వర్ధంతి

58 minutes ago

గుడివాడ: దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్మిక నగర్‌లోని ఆయన విగ్రహానికి డీఎస్పీ పాల శ్రీనివాస్, కమిషనర్ మనోహర్, వివిధ దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.