kntv
kntv

ప్రపంచంలోనే 11 రోజులు ఆగకుండా సుదూరంగా ఎగిరే వలస పక్షి..

1 hour ago

'బార్-టెయిల్డ్ గాడ్విట్' పక్షి ప్రపంచంలోనే అత్యంత సుదూరంగా నిరంతరాయంగా ఎగిరే వలస పక్షి. 2022లో అలస్కా నుంచి టాస్మానియా వరకు 13,560 కి.మీ. దూరాన్ని 11 రోజులు ఆగకుండా ప్రయాణించి రికార్డు సృష్టించింది. శరీరంలో నిల్వ చేసిన కొవ్వును శక్తిగా మార్చుకుని, నక్షత్రాలు, భూమి అయస్కాంత క్షేత్రాల ఆధారంగా దిశను గుర్తిస్తూ ఈ అద్భుత యాత్ర సాగిస్తుంది.