kntv
kntv

నందిగామ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

2 months ago

నందిగామ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే రూ.103.26 కోట్ల భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  సౌమ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు.