స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఒకటైన హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (Hazoor Multi Projects Ltd) స్టాక్ మళ్లీ దూకుడు చూపింది. నవంబర్ 29న చేసిన కీలక ప్రకటన కారణంగా సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఈ స్టాక్ హాట్‌టాపిక్‌గా మారనుంది. వారెంట్ల మార్పిడి నేపథ్యంపై భారీ స్థాయిలో ఈక్విటీ షేర్ల కేటాయింపును కంపెనీ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి సారించారు.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, రూ.1 ముఖ విలువ కలిగిన 13,20,000 ఈక్విటీ షేర్లను రూ.30 ఇష్యూ ధరతో కేటాయించనున్నారు. అంతకుముందు రూ.300 ఇష్యూ ధరతో జారీ చేసిన 1,32,000 వారెంట్ల స్థానంలో ఈ షేర్లు ఇన్వెస్టర్లకు ఇవ్వబడుతున్నాయని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేశారు. ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఈ షేర్ల కేటాయింపులో సీబర్డ్ లీజింగ్ అండ్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్, దేశాయ్ హెమంత్ కుమార్ అలాటీలుగా ఉన్నారు. సెబీ 2018 నిబంధనల ప్రకారం, ఈ వారెంట్లు పబ్లిక్ కేటగిరీకి కేటాయించబడినట్టు పేర్కొన్నారు. ఒక్కో వారెంట్‌కు రూ.300 ఉండగా, అందులో రూ.75 ముందుగా చెల్లించి వారెంట్లు పొందగా, ఇప్పుడు మిగిలిన మొత్తం చెల్లింపుతో షేర్లుగా మార్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం వారెంట్లు అలాట్ చేసిన 18 నెలల్లోనే రూ.225 చెల్లింపు పూర్తి అయిందని వివరించారు. ప్రస్తుతం కంపెనీ పెయిడప్ క్యాపిటల్ రూ.23.56 కోట్లుగా ఉంది.
స్టాక్ పనితీరును పరిశీలిస్తే—ఇటీవలి ట్రేడింగ్ సెషన్‌లో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ స్టాక్ 1% లాభంతో రూ.37.15 వద్ద ముగిసింది. గత అయిదు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేర్ 17.68% రిటర్న్స్ ఇచ్చింది. అయితే గత ఏడాదిలో ఈ స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంది. గత ఆరు నెలల్లో 14.42%, ఏడాదిలో 30.40% నష్టాన్ని చూడాల్సి వచ్చింది. కానీ దీర్ఘకాలం చూస్తే ఈ స్టాక్ అసలైన మల్టీబ్యాగర్. గత 5 సంవత్సరాల్లో ఈ స్టాక్ విలువ 15,350% పెరిగింది. అంటే అప్పట్లో పెట్టిన ₹1,00,000 పెట్టుబడి నేడు ₹1.53 కోట్లు కావడం విశేషం. స్టాక్ మార్కెట్లోకి 2002లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 1,236% పెరిగింది.
ఎప్పుడూ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి.