శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kohli's 52nd ODI hundred : రాంచీ టెస్టులో భారత్ భారీ స్కోరు: దుమ్మురేపిన విరాట్ కోహ్లీ

    2 నెలలు క్రితం

    రాంచీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యేకించి విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో ఆకట్టుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.

     

    కోహ్లీ దంచికొట్టాడు – 120 బంతుల్లో 135 రన్స్!

    టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో అభిమానులను మర్చిపోయేలా చేశాడు. 135 రన్స్ 120 బంతులు పలు అద్భుతమైన బౌండరీలు , వన్డేల్లో ఇది విరాట్‌కు 52వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 83వ సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో పాత aggressive-Kohli ని అభిమానులు మరోసారి చూశారు.

     

    టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ జోడీ గేమ్‌ను పూర్తిగా మార్చేసింది.

     

    రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరుపు

    కోహ్లీకి అద్భుత సపోర్ట్ అందించిన రోహిత్— 57 పరుగులు (51 బంతుల్లో) రెండో వికెట్‌కు 136 పరుగుల విలువైన పార్టనర్‌షిప్  టాప్ ఆర్డర్‌ను బలంగా నిలబెట్టింది. రోహిత్ ఔట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చాడు. అతని కీలక పరుగులు భారత్ స్కోరును మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.

    కోహ్లీ-రోహిత్-రాహుల్ దాడికి ప్రోటీస్ బౌలర్లు ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు. స్ట్రైక్ రొటేషన్, గ్యాప్‌లలో బంతి పంపించడం, అద్భుత డ్రైవ్‌లతో భారత్ బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం కొనసాగించారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Multibagger Stock Hazoor Multi Projects : హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దుమ్మురేపిన స్టాక్
    తర్వాత ఆర్టికల్
    Healthy Diet : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ‘క్యాలరీ డెఫిసిట్’ సరైనదా కాద ఎలా తెలుసుకోవాలి?

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి