టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో నవంబర్ 23 (ఆదివారం) రోజున ఆమె పెళ్లి జరుగాల్సి ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో వివాహ ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమయ్యి, హల్దీ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన హఠాత్తుగా హార్ట్ అటాక్కి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. ఈ అత్యవసర పరిస్థితి దృష్ట్యా స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త తేదీని కుటుంబ సభ్యులు త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉంది.