స్మాల్‌క్యాప్ జెమ్స్ & జ్యూవెలరీ సర్వీసెస్ రంగానికి చెందిన మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ తన వాటాదారులకు భారీ అప్‌డేట్ ఇచ్చింది. ఇటీవల బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీ స్టాక్ స్ప్లిట్ చేయాలని ఆమోదించగా, తాజాగా ఈ స్ప్లిట్‌కు సంబంధించిన రికార్డు డేట్‌ను డిసెంబర్ 2, 2025గా ప్రకటించింది.
1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం— నవంబర్ 13, 2025న జరిగిన బోర్డు సమావేశంలో 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్‌కి గ్రీన్ సిగ్నల్ లభించింది. అంటే రూ. 10 ఫేస్ విలువ ఉన్న 1 ఈక్విటీ షేరును, రూ. 2 ఫేస్ విలువ కలిగిన 5 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం సుమారు రూ. 140 వద్ద ఉన్న షేర్ ధర సుమారు రూ. 28 స్థాయికి చేరే అవకాశం ఉంది.
మినీ డైమండ్స్ షేర్ పనితీరు – మల్టీబ్యాగర్ హిస్టరీ
గత ఐదేళ్లలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు అద్భుత రాబడులు అందించింది.
5 సంవత్సరాల్లో లాభం: 5187% రూ. 1 లక్ష పెట్టుబడి విలువ: రూ. 51.87 లక్షలు ,ప్రస్తుతం మార్కెట్ క్యాప్: రూ. 330 కోట్లు
అయితే ఇటీవల ఈ స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది—
వారం రోజుల్లో: 3% నష్టం. నెలలో: 3% తగ్గుదల, ఆరు నెలల్లో: 27% పడిపోయింది ఏడాదిలో: 30% నష్టం
శుక్రవారం ముగిసిన మార్కెట్ సెషన్‌లో షేరు 1.30% క్షీణించి రూ. 140.10 వద్ద ముగిసింది.
52 వారాల గరిష్ఠం: రూ. 233
కనిష్ఠం: రూ. 97.50
ఎందుకు స్టాక్ స్ప్లిట్?
కంపెనీ ప్రకటన ప్రకారం—
-
షేర్ ధరను రీటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చడం,
-
లిక్విడిటీ పెంచడం ప్రధాన లక్ష్యాలు.