చింతలపూడి ఎమ్మెల్యే రోశన్ కుమార్ లక్కవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని కాసరపు జాహ్నవిని రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలో ద్వితీయ బహుమతి సాధించి, ఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా అభినందించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దుర్గారావు విద్యార్థినిచే సాధించిన ప్రతిభను ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే 2019లో ఇదే పాఠశాల విద్యార్థిని బాసి సంధ్యకు ఎమ్మెల్యే చేసిన సహాయాన్ని జాహ్నవి గుర్తు చేసుకుంటూ, ఆ ప్రోత్సాహం తన చదువుల పురోగతికి ఉపయోగపడ్డదని తెలిపింది.
విద్యార్థినిల సహజ ప్రతిభను గమనించిన ఎమ్మెల్యే మరింత ప్రోత్సాహాన్ని ప్రకటించారు. హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ మనోహర్ ఎమ్మెల్యే చిత్రపటాన్ని డ్రాయింగ్ రూపంలో తయారు చేసి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ దల్లి దుర్గారెడ్డి, కొదమ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Click here to
Read More