బ్యాంకాక్, నవంబర్ 21:
ప్రపంచ అందాల ప్రప్రథమ పటిమ అయిన మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ సొంతం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని నాంథబురి ప్రాంతంలో ఉన్న ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌లో శుక్రవారం జరిగిన ఘనమైన సమారంభంలో ఆమెను విజేతగా ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు, భారత కాలమానం ప్రకారం 6:30 గంటలకు ఈ ఫైనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున పోటీపడిన మణిక విశ్వకర్మ టాప్ 30 వరకూ చేరినప్పటికీ, టాప్ 12లో స్థానం దక్కించుకోలేకపోయారు.
మిస్ యూనివర్స్ 2025 — ఫైనల్ ఫలితాలు
విజేత: మెక్సికో – ఫాతిమా బాష్
1వ రన్నర్-అప్: థాయ్‌లాండ్ – ప్రవీణార్ సింగ్
2వ రన్నర్-అప్: వెనిజులా – స్టెఫానీ అబాలి
3వ రన్నర్-అప్: ఫిలిప్పీన్స్ – అహ్తిసా మనలో
4వ రన్నర్-అప్: కోట్ డి ఐవోర్ – ఒలివియా యేస్
ఈ ఘనమైన అంతర్జాతీయ వేడుకలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, మాజీ మిస్ యూనివర్స్ నటాలీ గ్లెబోవా సహా అనేక అంతర్జాతీయ ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అదే వేదికలో, వచ్చే ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ 2026 పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యమివ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.