జగ్గయ్యపేట తొలి ఉదయం.
జగ్గయ్యపేట పురపాలక సంఘం పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. “సఖి సురక్ష” కార్యక్రమంలో భాగంగా అర్బన్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్లు పైబడిన మహిళా సంఘ సభ్యులందరికీ ఉక్కు కళావేదికలో శుక్రవారం ఉచిత వైద్య పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడినాయి.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ ఆరోగ్య శిబిరంలో ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా థైరాయిడ్, హిమోగ్లోబిన్, క్యాన్సర్ పరీక్షలు మరియు ఇతర సమగ్ర ఆరోగ్య పరీక్షలను అందించింది. మెప్మా మరియు e-Vaidya Pvt. Ltd. సంస్థ అవగాహన ఒప్పందం ద్వారా ఈ సేవలు చేపట్టారు.
ఈ ఉచిత ఆరోగ్య పరీక్షల ద్వారా మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభించడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం సుమారు 650 మంది మహిళలు ఈ వైద్య పరీక్షలు చేయించుకున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు: గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. మురళీ కృష్ణ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ డి. తులసి వెంకట కృష్ణారావు ఐబికే సుగుణ పట్టణ మహిళా సమైక్య ప్రెసిడెంట్ షేక్ నజీమున్ మెప్మా సి.ఎం.యం. కవిత సి.ఓ వెంకయ్య , ప్రసాద్.సమాఖ్య పదాధికారులు మరియు ఆర్పీలు.
సామాజిక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మహిళల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం విజయం సాధించి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం విశేషం.