పాకిస్థాన్‌లో పారిశ్రామిక భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం మరోసారి అమానుష ప్రమాదానికి దారితీసింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ నగరంలో గ్లూ (గమ్) తయారీ ఫ్యాక్టరీలో భారీ బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ భయంకర ఘటనలో 15 మంది కార్మికులు మృతి, 7 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు.
★ శిథిలాల కింద ఇంకా కొందరు ఉండవచ్చని అనుమానం
పేలుడు జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
రక్షణ సిబ్బంది ప్రకారం: ఫ్యాక్టరీ పూర్తిగా కుప్పకూలింది. మిగిలిన శిథిలాల కింద కార్మికులు చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. అందువల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా హెచ్చరించింది
★ పరిసర ప్రాంతాలూ ధ్వంసం
పేలుడు తీవ్రత అంతలా ఎక్కువగా ఉంది, ఫ్యాక్టరీ మొత్తాన్ని నేలమట్టం చేయడమే కాకుండా ,చుట్టుపక్కల ఇళ్లు, షాపులు, చిన్న నిర్మాణాలన్నీ కూడా భారీగా దెబ్బతిన్నాయి
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం పేలుడు శబ్దం దాదాపు 2–3 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది.
★ కారణం ఇంకా తెలియదు – పోలీసులు దర్యాప్తు ప్రారంభం
పేలుడు ఎందుకు జరిగిందో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం బాయిలర్‌కు తగిన మెయింటెనెన్స్ లేకపోవడం
ప్రధాన కారణాలుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు మేనేజర్‌ను మాత్రం అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు
★ పాకిస్థాన్‌లో పారిశ్రామిక ప్రమాదాలు రోజు రోజుకీ పెరుగుతున్నవే
ఈ ఘటన పాకిస్థాన్‌లో పారిశ్రామిక భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. గత కొన్నేళ్లుగా అక్కడ ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు, బాయిలర్ పేలుళ్లు తరచూ సంభవిస్తున్నాయి.
సిబ్బంది భద్రత, పర్యవేక్షణ, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.