కొలంబోలో నిర్వహించిన మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి చరిత్ర రాసింది. టోర్నమెంట్ మొత్తం భారత జట్టు అజేయంగా, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రదర్శన కనబరిచింది.
ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్ బ్యాటర్లను 114 పరుగుల వద్ద ఆపగా, 115 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలో ఛేదించింది. ఖులా షరీర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
నవంబర్ 11న ఢిల్లీలో ప్రారంభమైన టోర్నీలో భారత్, నేపాల్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా జట్లు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు చేరింది. ఈ విజయం దేశంలో అంధుల క్రికెట్‌కు మరింత గుర్తింపు, ప్రోత్సాహం కల్పించనుంది.