రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే ప్రత్యేక ఉత్సాహం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందాలు, ఎడ్ల పందేలు, పతంగుల పోటీలు, సంక్రాంతి ముగ్గులు వంటి వేడుకల కోసం సొంతూర్లు చేరే వారితో పండగ సందడి మరింత పెరుగుతుంది. ఉద్యోగాలు, చదువుల కోసం బయట ఉన్నవారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగకు మరో ఏడు వారాల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ప్రయాణికులకు రవాణా కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి.
ట్రైన్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిండివేసి ‘రిగ్రెట్’
జనవరి 14 (బుధవారం) సంక్రాంతి కావడంతో, దానికి ముందు వచ్చే భోగి – కనుమ వేళల్లో పెద్ద ఎత్తున ప్రయాణాలు జరుగుతాయి. ఈసారి కూడా జనవరి 9 నుండి 13 వరకు రైళ్లలో డిమాండ్ భారీగా పెరిగింది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాలకు వెళ్లే ట్రైన్లు—
-
గోదావరి
-
గరీబ్ రథ్
-
ఈస్ట్ కోస్ట్
-
చార్మినార్
-
సింహపురి
-
గౌతమి
-
కోణార్క్
-
శబరి
-
నారాయణాద్రి
-
పద్మావతి
ఈ అన్ని రైళ్లలో జనవరి 9 నుంచి వెయిటింగ్ లిస్టులు శిఖరస్థాయికి చేరి, చాలా తేదీల్లో ‘రిగ్రెట్’ స్థాయికి చేరిపోయాయి. అంటే టికెట్ దొరికే అవకాశం దాదాపు లేనట్టే.
హైదరాబాద్ నుంచి అత్యంత రద్దీ ఉన్న రూట్లు
-
విజయవాడ
-
రాజమహేంద్రవరం
-
కాకినాడ
-
నరసాపురం
-
విశాఖపట్నం
-
గుంటూరు
-
ఒంగోలు
-
నెల్లూరు
చిత్తూరు, తిరుపతి వైపు వెళ్లే శబరి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో కూడా కొన్ని తేదీల్లో రిగ్రెట్ కనిపిస్తోంది. సమీప ప్రాంతాలకు వెళ్లే వందే భారత్, గరీబ్ రథ్ రైళ్లలో కూడా ఇదే పరిస్థితి.
బస్సుల్లో కూడా హాట్ డిమాండ్ – APSRTC టికెట్లు ఫుల్
రైళ్లే కాకుండా బస్సుల్లోనూ ప్రయాణాల డిమాండ్ పెరిగిపోయింది.
-
APSRTC బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే అన్ని ప్రధాన రూట్లలో సీట్లు దాదాపు నిండిపోయాయి.
-
TSRTCలో మాత్రమే కొద్దిపాటి సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితి అయితే మరింత చెడ్డది.
డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి.
ప్రయాణికులకు ఇదో ముందస్తు హెచ్చరిక
సంక్రాంతికి ఇంకా కొన్ని వారాల సమయం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ట్రావెల్ ప్లాన్ చేసుకోకపోతే పండగ రోజులకు ప్రయాణం దాదాపు అసాధ్యం కావచ్చని రవాణా శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.