పుట్టపర్తి, | నవంబర్ 23
పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాబా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
సత్యసాయిబాబా ప్రతి మనిషిలో దేవత్వాన్ని చూడగలిగారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని, ప్రేమతో ఏదైనా సాధించవచ్చని బాబా నిరూపించారని కొనియాడారు. సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం కూడా చేయలేని సామాజిక సేవలను సత్యసాయి ట్రస్టు నెరవేర్చిందని సీఎం ప్రత్యేకంగా గుర్తించారు. ఈ వేడుకల్లో ప్రజలు, భక్తులు బాబా సేవలను, ఆలోచనలను గౌరవిస్తూ పాల్గొంటున్నారు.