ఇంటర్నెట్ డెస్క్ డిసెంబరు 2 : వైభవ్ సూర్యవంశీ… దేశవాళీ క్రికెట్‌లో కొత్త సంచలనం సృష్టిస్తున్న ఈ బాబు మరోసారి రికార్డు బద్దలు కొట్టాడు. కేవలం 14 ఏళ్లు 250 రోజులు మాత్రమే ఉన్న అతడు, దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.
మంగళవారం జరిగిన మహారాష్ట్ర – బిహార్ మ్యాచ్‌లో ఈ అద్భుతం నమోదు కావడం విశేషం. బిహార్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ 61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు సాయంతో 108 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది.
విజయ్ జోల్ రికార్డు దుమ్ము దులిపిన వైభవ్
ఈ రికార్డు ముందుగా విజయ్ జోల్ పేరిట ఉండేది. విజయ్ జోల్ వయసు: 18 ఏళ్లు 118 రోజులు. సెంచరీ: 2013లో ముంబైపై 63 బంతుల్లో
అయితే, వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులోనే ఈ రికార్డును అధిగమించడం యువ ప్రతిభకు నిదర్శనం. ఆసక్తికరమైన విషయం ఏమంటే — విజయ్ కూడా అప్పుడు మహారాష్ట్ర తరఫునే ఆడాడని గుర్తుచేశారు క్రికెట్ ప్రేమికులు.
వైభవ్ – సెంచరీల వరద
ఈ టోర్నీలో ఇది వైభవ్ తొలి శతకం అయినప్పటికీ, అతడి బ్యాట్ నుంచి ఇది వచ్చిన మూడో టీ20 సెంచరీ. ఐపీఎల్ 2025. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 .ఈ రెండింటిలోనూ అతడు శతకాలు సాధించడంతో, క్రికెట్‌లో ఎదుగుతున్న స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్‌కు వైభవ్ సెంచరీతో సూపర్ స్టార్ట్ లభించింది. నిర్ణీత 20 ఓవర్లలో బిహార్ 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు నమోదు చేసి మహారాష్ట్రపై ఒత్తిడి పెంచింది.