శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Priyanka Mohan : తణుకులో స్వయంభూ కపర్దేశ్వర స్వామి దర్శించిన నటి ప్రియాంక మోహన్

    1 వారం క్రితం

    దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతున్న నటి ప్రియాంక మోహన్ తణుకు పట్టణంలో ప్రసిద్ధమైన స్వయంభూ కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాలలో వరుస విజయాలతో మంచి గుర్తింపు పొందుతున్న ప్రియాంక మోహన్ యొక్క ఈ ఆలయ దర్శనం స్థానిక భక్తులు, అభిమానుల్లో విశేష ఆకర్షణగా నిలిచింది.

     

    ఆమె ముందుగా పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు డా. భమిడి అఖిల్ మరియు ఘనపాటి భమిడి సీతారామ కృష్ణావధాని నివాసానికి విచ్చేసి ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం వారు కలిసి స్వయంభూ కపర్దేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక దర్శనం చేశారు.  ఆలయ ప్రాంగణంలో ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, అభిమానులు చేరుకోవడంతో ఆలయానికి ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.

     

    ప్రియాంక మోహన్ – వేగంగా ఎదుగుతున్న నటి

     

    1994 నవంబర్ 20న జన్మించిన ప్రియాంక అరుల్ మోహన్ 2019లో కన్నడ చిత్రం *Ondh Kathe Hella* ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం తమిళంలో *Doctor*, *Don*, Captain Miller వంటి సినిమాలతో భారీ విజయాలు సాధించింది. తెలుగులో Sreekaram, SR Kalyanamandapam చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన నటించిన *OG* చిత్రంతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

     

    సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Pawan Kalyan : ఏలూరు జిల్లా పర్యటనలో మాట నిలబెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన
    తర్వాత ఆర్టికల్
    Usha Vance Breaks Silence : జేడీ వాన్స్–ఉషా చిలుకూరి విడాకుల రూమర్లపై తెరపడింది

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి