శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    MEESHO IPO GMP : మీషో ఐపీఓ డిసెంబర్ 3న మొదలు – ₹5,421 కోట్ల భారీ పబ్లిక్ ఇష్యూ

    3 days ago

    ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ మీషో(Meesho) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు సిద్ధమైంది. సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతు పొందిన ఈ కంపెనీ, డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తేనుంది. కంపెనీ ఒక్కో షేర్ ధర శ్రేణిని ₹105–₹111గా నిర్ణయించింది. గరిష్ట ధరను పరిశీలిస్తే, మీషో పబ్లిక్ ఇష్యూ మొత్తం విలువ ₹50,096 కోట్లకు చేరనున్నట్లు అంచనా. డిసెంబర్ 2న యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రత్యేక విండో ప్రారంభమవుతుంది. డిసెంబర్ 3న ఐపీఓ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ అనంతరం, కంపెనీ షేర్లు డిసెంబర్ 12న స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ కానున్నాయి.

     

    ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ₹4,250 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లు జారీ చేయబడతాయి. అదనంగా, ₹1,771 కోట్ల విలువైన 10.55 కోట్లు షేర్లు Offer for Sale (OFS) రూపంలో విక్రయించబడతాయి. ఇందులో ఎలివేషన్ పీక్ ఎక్స్‌వీ, వెంచ్ హైవే, వై కాంబినేటర్ వంటి మీషోలో పెట్టుబడులు పెట్టిన ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు. షేర్ల కేటాయింపులో 75 శాతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, మిగతా 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.

     

    ఈ ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను Meesho సంస్థ క్లౌడ్ ఇన్‌ఫ్రా విస్తరణ, మార్కెటింగ్, ఇన్‌ఆర్గానిక్ గ్రోత్, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్, కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది. మదుపరుల్లో ఈ ఐపీఓపై మంచి ఆసక్తి కనిపిస్తోంది. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, మీషో షేర్ లిస్టింగ్ ₹140 వరకు వెళ్లే అవకాశం ఉందని సూచిస్తున్నారు. IPO మార్కెట్లో ఈ ఇష్యూ ప్రస్తుతం అత్యంత చರ್ಚనీయ అంశంగా మారింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Nara Brahmani : హిందూపురం పర్యటనలో నారా బ్రాహ్మణి – విద్యాభివృద్ధికి హెరిటేజ్ సంస్థ నుంచి మరిన్ని సేవలు
    తర్వాత ఆర్టికల్
    SriLankaFloods : ఆగ్నేయాసియాలో ఘోర తుపాను తాండవం – లక్షలాది మంది ప్రభావితం, వందలాది ప్రాణాలు విడిచిన దుర్ఘటన

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి