శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    food : హెల్దీ ఫుడ్స్‌ను సరైన టైమ్‌లో తింటేనే నిజమైన ప్రయోజనం

    1 వారం క్రితం

    హైదరాబాద్:
    హెల్త్ కోసం హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిదే. కానీ వాటిని ఎప్పుడు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఫుడ్ ఎంత హెల్దీ అయినా, సరైన సమయానికి తినకపోతే అవి శరీరానికి మంచికన్నా సమస్యల్ని ఎక్కువగా తెస్తాయని ఆమె చెబుతున్నారు.

    పండ్లు – ఆహారం తిన్న వెంటనే కాదు

    పండ్లు వైవిధ్యభరితమైన పోషకాల నిలయం. కానీ వీటిని ఆహారం తిన్న వెంటనే తింటే మాత్రం జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెవీగా అనిపించడం, అసిడిటీ. త్రేన్పులు. బ్లోటింగ్ వంటి సమస్యలు రావచ్చు. అందుకే పండ్లను భోజనం తర్వాత వెంటనే కాకుండా, మధ్యలో గ్యాప్ పెట్టి తినడం మంచిది.

     

    సలాడ్ – రాత్రి సమయం వేళ కాదు

    సలాడ్ తినడం హెల్తీ అలవాటు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎక్కువగా సలాడ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పచ్చి సలాడ్‌ను సాయంత్రం లేదా రాత్రి తినడం మంచికాదు.  రాత్రివేళ జీర్ణశక్తి తగ్గుతుంది. పచ్చి కూరగాయలు ఈ సమయంలో జీర్ణం కావడం కష్టం, బ్లోటింగ్, గ్యాస్, అసౌకర్యం రావచ్చు సలాడ్‌ను పగటి పూట, సూర్యుడు ఉన్నప్పుడు తింటేనే శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోగలదు.

     

    పెరుగు – రాత్రి తప్పక వద్దు

    పెరుగు హెల్దీ ఫుడ్ అని అందరికీ తెలిసిందే. కానీ: రాత్రివేళ పెరుగు తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. గ్యాస్, బ్లోటింగ్,  డ్రైనెస్,  నిద్రలో అంతరాయం వంటి సమస్యలు రావచ్చు. పెరుగును తప్పనిసరిగా పగటిపూటే తినాలి. సూర్యుడు ఉన్నప్పుడు తీసుకుంటేనే అది శరీరానికి మేలు చేస్తుంది.

    హెల్దీ ఫుడ్ తినడం మాత్రమే సరిపోదు, ఎప్పుడు తింటున్నామన్నదే కీలకం. సరైన టైమ్‌లో తీసుకుంటే: జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  హెల్త్ సమస్యలు తగ్గుతాయి,  శరీరం ఫుడ్లోని పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది తప్పు సమయంలో తింటే  బ్లోటింగ్ , గ్యాస్, అసిడిటీ,  నిద్ర సమస్యలు లాంటివి రావచ్చు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    NFOs : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 6 కొత్త ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి – 5 పాసివ్ ఫండ్స్, 1 ఎస్ఎఫ్ఐ స్కీమ్
    తర్వాత ఆర్టికల్
    CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రైతన్నా.. మీ కోసం' కార్యక్రమం ప్రారంభం: సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి