శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MP R Krishnaiah Warns Congress : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతాం – ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆగ్రహం

    4 రోజులు క్రితం

    హైదరాబాద్‌:  తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి ఉధృతమైంది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజన సంఘాలు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొన్న నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం జరిగింది.

     

    ధర్నాలో ప్రసంగించిన ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దశలోనూ విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో జీఓ 46ను తీసుకొచ్చి బీసీలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన సమయం ఇదేనని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

     

    రానున్న పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేలా తామే ముందుకు వచ్చి ప్రధాని నరేంద్రమోదీకి విన్నవిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో పరేడ్‌ మైదానంలో లక్షలాదిమందితో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించి బీసీల డిమాండ్లను గట్టిగా వినిపిస్తామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, కొండా దేవన్న, నీలా వెంకటేశ్‌, భూమన్నగౌడ్‌, గుజ్జ సత్యం, రాజేందర్‌, అనంతయ్య తదితర బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపైనా, రాజకీయ హామీలపైనా పోరాటం ముమ్మరమవుతుందన్న సంకేతాలు ఈ ధర్నాతో స్పష్టమయ్యాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    MLA Ganta Srinivasa Rao : విశాఖపట్నంకు గూగుల్‌ రాక – భారీ గేమ్‌ ఛేంజర్‌గా మారబోతోందని గంటా శ్రీనివాసరావు
    తర్వాత ఆర్టికల్
    jammu kashmir basantgarh terror movement : జమ్మూకశ్మీర్ బసంత్‌గఢ్‌లో ఉగ్రవాదుల కదలికలు – భారీ సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతాదళాలు

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి