శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    jammu kashmir basantgarh terror movement : జమ్మూకశ్మీర్ బసంత్‌గఢ్‌లో ఉగ్రవాదుల కదలికలు – భారీ సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతాదళాలు

    3 days ago

    ఇంటర్నెట్ డెస్క్:  జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఉధమ్‌పూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలోని ఛింగ్లా–బలోతా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరించినట్టు భద్రతాదళాలకు సమాచారం రావడంతో, ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారు. గ్రామంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న అనుమానాస్పద ఘటన స్థానికులు, భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది.

    రాత్రి వేళ ఓ గ్రామస్థుడి ఇంటి తలుపు తట్టి ఆహారం అడిగిన ముగ్గురు వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఇంటి యజమాని భయపడి అక్కడి నుంచి తప్పించుకున్నారు. వెంటనే ఈ విషయం భద్రతా దళాలకు తెలపగా, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకశ్మీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని ముట్టడి చేసి భారీ గాలింపు చర్యలు మొదలు పెట్టారు. భద్రతా దళాలు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై ముందస్తు అలెర్ట్‌లో ఉన్నాయని, చివరిరాత్రి జరిగిన ఘటనతో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానం మరింత బలపడిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అడవులు, పర్వతాలు, లోతైన లోయలు ఉన్న బసంత్‌గఢ్ ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

     

    పర్వత మార్గాలే ఉగ్రవాదుల ప్రవేశ దారి

    భారత్‌లోకి చొరబడే ఉగ్రవాదులు తరచుగా బసంత్‌గఢ్ ప్రాంతాన్ని ప్రధాన మార్గంగా ఉపయోగిస్తున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. కథువా సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దును దాటి, బసంత్‌గఢ్ – దోడా – కిష్ట్‌వార్ జిల్లాల మీదుగా కశ్మీర్ లోయకు చేరుకోవడం వారికి సులభమవుతోంది. పర్వతాలు, దట్టమైన అడవి ప్రాంతాలు కారణంగా ఉగ్రవాదులు ఇక్కడ దాచుకోవడానికి అనుకూలంగా ఉండటంతో ఎన్నో ఎన్‌కౌంటర్లు గతంలో ఇదే ప్రాంతంలో జరిగినాయి.

     

    తాజా సమాచారం మేరకు ఉగ్రవాదులు సమీప అడవుల్లో దాక్కుని ఉండే అవకాశం ఉన్నందున భద్రతా దళాలు భారీ స్థాయిలో శోధన చర్యలను కొనసాగిస్తున్నాయి. గ్రామాలు, పర్వతాలు, అడవులు అన్నీ నిఘా కంట్రోల్‌లోకి తీసుకుంటూ హై అలర్ట్‌లో ఆపరేషన్లు సాగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు పది మందికి పడని తీవ్ర నిఘాతో ప్రాంతాన్ని కప్పి ఉగ్రవాదుల కోసం వెతికిపడుతున్నాయి. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    MP R Krishnaiah Warns Congress : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతాం – ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆగ్రహం
    తర్వాత ఆర్టికల్
    Nara Brahmani : హిందూపురం పర్యటనలో నారా బ్రాహ్మణి – విద్యాభివృద్ధికి హెరిటేజ్ సంస్థ నుంచి మరిన్ని సేవలు

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి