మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు అందించారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీపడకూడదని స్పష్టంగా ఆదేశించారు. నిర్మాణాల్లో చిన్న విమర్శకు కూడా తావు ఉండకూడదని, ప్రతీ పని అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.
గద్దెల సమీపంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గద్దెల నాలుగు వైపులా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి, మొత్తం పరిసరాలు వైభవంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గుడి చుట్టూ పచ్చదనం విస్తరించేలా గ్రీనరీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.