ఇంటర్నెట్ డెస్క్ డిసెంబరు 2 : దిత్వా తుపాను తీవ్ర బీభత్సంతో శ్రీలంకలో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సంక్షోభ సమయంలో ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఆపరేషన్ సਾਗర్ బంధు పేరిట అత్యవసర మానవతా సాయం అందిస్తూ శ్రీలంకకు అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు సాయం పంపించాలన్న పాక్ నిర్ణయాన్ని కూడా భారత్ సులభతరం చేసింది. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా శ్రీలంక చేరేందుకు అనుమతి కోరగా, భారత్ వెంటనే అనుమతి మంజూరు చేసింది. అయితే ఇంతటి మానవతా సహకారం అందించిన సమయంలో కూడా పాక్ మరోసారి దుష్ప్రచారానికి తెరలేపింది.
“భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ ఫేక్ వార్తలు” – భారత వర్గాల ఖండన
పాక్ మీడియా భారత్‌పై మరోసారి అసత్య ప్రచారం ప్రారంభించింది. మానవతా సాయం కోసం పంపిన పాక్ విమానాలకు భారత్ గగనతల అనుమతులు ఇవ్వలేదంటూ అక్కడి మీడియా కథనాలు వండివార్చింది.
అయితే ఈ ఆరోపణలను భారత వర్గాలు స్పష్టంగా తిరస్కరించాయి. పాక్ అభ్యర్థన వచ్చిన వెంటనే అనుమతులు మంజూరు చేశామన్నది భారత వర్గాల మాట. ప్రామాణిక ప్రక్రియలు, భద్రతా అంశాలు పరిశీలించి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన పాక్ అభ్యర్థనకు, కేవలం నాలుగు గంటల్లోనే భారత్ స్పందించి గగనతల అనుమతులిచ్చింది. “పాక్ మీడియా ప్రచారం పూర్తిగా అసత్యం” అని భారత వర్గాలు స్పష్టం చేశాయి.
శ్రీలంకకు భారత్ భారీ సహాయం – 53 టన్నుల సరకులు, విపత్తు బృందాలు పంపిణీ
దిత్వా తుపాను ప్రభావంతో సతమతమవుతున్న శ్రీలంకకు భారత్ భారీ స్థాయిలో సాయం అందిస్తోంది. 53 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి వైద్య బృందాలు జాతీయ విపత్తు నిర్వహణ దళాలు (NDRF), భారత నేవీ – శ్రీలంక ఎయిర్ ఫోర్స్‌తో కలిసి సహాయక చర్యలు ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది.
దిత్వా తుపాను మిగిల్చిన విషాదం
దిత్వా బీభత్సం వల్ల శ్రీలంక ఇప్పటివరకు భారీ నష్టాన్ని ఎదుర్కొంది. 360 మంది మరణించారు. 370 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది నిర్వాసితులయ్యారు వీరిని ప్రభుత్వం తాత్కాలిక వసతి కేంద్రాలకు తరలించింది. తుపాను ప్రభావం అత్యధికంగా కనిపించిన జిల్లాలు — కండి, బదుల్లా, నువారా ఎలియా, మటాలే.