శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MLA Ganta Srinivasa Rao : విశాఖపట్నంకు గూగుల్‌ రాక – భారీ గేమ్‌ ఛేంజర్‌గా మారబోతోందని గంటా శ్రీనివాసరావు

    4 రోజులు క్రితం

    తిరుమల: విశాఖపట్నం అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భావించారు. శుక్రవారం సినీనటులు శ్రీకాంత్‌, అశోక్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, ఆలయం ముందు మీడియాతో ఆయన పలు ముఖ్య విషయాలు వెల్లడించారు. ఇటీవల గూగుల్‌ సంస్థ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకోవడం అత్యంత సానుకూల పరిణామమని, ఇది నగర అభివృద్ధికి భారీ ఉత్సాహాన్ని అందించనున్నదని పేర్కొన్నారు.

     

    గతంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నగర దృశ్యం పూర్తిగా మారిపోయిందని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడుల కారణంగా సైబరాబాద్‌ లాంటి అత్యాధునిక ఐటీ నగరం ఏర్పడిందని, హైదరాబాద్‌ ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. ఇదే తరహాలో గూగుల్‌ అడుగుపెట్టడం విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా రూపాంతరం చెందేందుకు దోహదం చేస్తుందని గంటా తెలిపారు.

     

    విశాఖపట్నం‌పై ఆసక్తి చూపుతున్న సంస్థలు కేవలం గూగుల్‌ మాత్రమే కాదని, రిలయన్స్‌, టీసీఎస్‌ వంటి దేశీయ-అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా నగర అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఇది రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు పెద్ద అవకాశమని అన్నారు.  ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి కూడా ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, న్యాయవేత్తల సందర్శనతో శ్రీవారి దర్శనాల రద్దీ కొనసాగుతోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడి అత్యంత కీలక సహాయకుడు యెర్మాక్‌కు ఉద్వాసన – చమురు అవినీతి కేసుతో రాజకీయ తుపాను
    తర్వాత ఆర్టికల్
    MP R Krishnaiah Warns Congress : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతాం – ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆగ్రహం

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి