శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడి అత్యంత కీలక సహాయకుడు యెర్మాక్‌కు ఉద్వాసన – చమురు అవినీతి కేసుతో రాజకీయ తుపాను

    4 రోజులు క్రితం

    ఇంటర్నెట్ డెస్క్:  ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలెన్‌స్కీ తన అత్యంత సన్నిహిత అనుచరుడు, ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆండ్రీ యెర్మాక్‌(Andriy Yermak)ను పదవి నుండి తప్పించారు. దేశంలోని చమురు రంగంలో దాదాపు 10 కోట్ల డాలర్ల భారీ అవినీతి జరగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులోని దర్యాప్తు భాగంగా యెర్మాక్ నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవలి రోజుల్లో దూకుడు సోదాలు జరిపిన విషయం తెలిసిందే.

    యెర్మాక్ గత 15 ఏళ్లుగా జెలెన్‌స్కీకి అత్యంత విశ్వసనీయుడు. హాస్యనటుడిగా తనకంటూ పేరున్న జెలెన్‌స్కీకి, మాజీ నిర్మాతగా, కాపీరైట్ న్యాయవాదిగా పనిచేసిన యెర్మాక్‌తో దీర్ఘకాలిక అనుబంధం ఉంది. 2019లో ఉక్రెయిన్ రాజకీయాల్లోకి ఇద్దరూ ప్రవేశించిన తర్వాత, యెర్మాక్ ప్రభావం మరింత పెరిగింది. ముఖ్యంగా జెలెన్‌స్కీ అధ్యక్షుడయ్యాక, ఆ దేశ ప్రధానిని సహా పలు కీలక మంత్రుల నియామకాల్లో యెర్మాక్ ప్రధాన పాత్ర పోషించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావంతో ఆయనను దేశంలో రెండో అత్యంత ప్రభావశీలి, ఒకానొక సందర్భంలో ‘వైస్ ప్రెసిడెంట్’గా కూడా పలువురు పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ప్రారంభం తర్వాత అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా యెర్మాక్ కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా యుద్ధ విరమణపై ఒత్తిడి పెంచుతున్న సమయాన, యెర్మాక్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు జెలెన్‌స్కీకి రాజకీయంగా పెద్ద దెబ్బగా మారాయి.

     

    ఉక్రెయిన్‌ను ఐరోపా సమాఖ్య (EU)లో చేర్చుకునే నిర్దేశంలో, దేశంలో ముందుగా అవినీతిని నిర్మూలించాలని ఈయూ స్పష్టమైన షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, యెర్మాక్‌పై వేటు పడటం అనివార్యమయ్యింది. ఇదే చమురు కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. యెర్మాక్‌కు దగ్గరగా ఉన్న ఇద్దరు అసిస్టెంట్లలో ఒకరు గతేడాది రాజీనామా చేయగా, మరొకరు ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ఈ ముగ్గురిపై అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది.

     

    ప్రతిపక్షం నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లతో యెర్మాక్ తన రాజీనామా పత్రాన్ని జెలెన్‌స్కీకి సమర్పించగా, అధ్యక్షుడు దానిని ఆమోదించారు. దీంతో యెర్మాక్ పదవినుంచి తప్పుకొని, జెలెన్‌స్కీ ప్రభుత్వం కీలక స్థానంలో పెద్ద మార్పుకు నాంది పలికారు. ఈ పరిణామంతో ఉక్రెయిన్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా కుదుటపడగా, రష్యా యుద్ధం, ఈయూ చేరిక, అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో జెలెన్‌స్కీకి కొత్త సవాళ్లు ఎదురవనున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Sri Padmavathi Amma : శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావం – పంచమితీర్ధం ఉత్సవం
    తర్వాత ఆర్టికల్
    MLA Ganta Srinivasa Rao : విశాఖపట్నంకు గూగుల్‌ రాక – భారీ గేమ్‌ ఛేంజర్‌గా మారబోతోందని గంటా శ్రీనివాసరావు

    సంబంధిత అంతర్జాతీయం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి