శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Usha Vance Breaks Silence : జేడీ వాన్స్–ఉషా చిలుకూరి విడాకుల రూమర్లపై తెరపడింది

    1 వారం క్రితం

    వాషింగ్టన్, నవంబర్ 24 — అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉషా చిలుకూరి విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఉషా వాన్స్ టీమ్ అధికారికంగా స్పందిస్తూ స్పష్టతనిచ్చింది.

    TPUSA కార్యక్రమం – వైరల్ హగ్ వీడియోతో రూమర్ల ఊసులు

    మిసిసిప్పీ యూనివర్సిటీలో జరిగిన TPUSA కార్యక్రమంలో జేడీ వాన్స్ పాల్గొని, అక్కడే చనిపోయిన రిపబ్లికన్ కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను హగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనితో ఇద్దరి మధ్య ప్రత్యేక సంబంధం ఉందన్న ఊహాగానాలు వేగంగా వ్యాపించాయి.

    ఇంతకుముందు ఉటా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో చార్లీ కిర్క్ కాల్పులకు గురై మరణించిన విషయం తెలిసిందే. అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, కానీ తన భర్తలో ఉన్న కొంత సమానతను వాన్స్‌లో చూస్తున్నానని ఎరికా కిర్క్ స్టేజ్‌పై చెప్పిన తర్వాత ఆ హగ్ చోటుచేసుకుంది.

    ఉంగరం కనిపించకపోవడంతో కొత్త రూమర్లు

    ఇటీవల ఉషా చిలుకూరి, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి నార్త్ కరోలినాలోని మెరైన్ కార్ప్స్ సెంటర్‌ను సందర్శించినప్పుడు వెడ్డింగ్ రింగ్ లేకుండా కనిపించడం కూడా రూమర్లకు మరొక కారణమైంది. అలాగే ఇటీవల వాన్స్ చేసిన—హిందువైన తన భార్య భవిష్యత్తులో క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నానన్న వ్యాఖ్య—చర్చలకు దారితీసింది.

    ఉషా వాన్స్ టీమ్ స్పందన—"ఆమె ముగ్గురు పిల్లల తల్లి, పనుల్లో రింగ్ మర్చిపోవడం సహజం"

    విడాకుల వార్తలు వేగంగా వ్యాపించడంతో ఉషా వాన్స్ ప్రతినిధి స్పందిస్తూ:

     జేడీ వాన్స్ మరియు ఉషా చిలుకూరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు — ఇవాన్ (8), వివేక్ (5), మిరాబెల్ (3).  అని ఇంటి పనులు, పాత్రలు కడగడం, పిల్లలకు స్నానం చేయించడం వంటి పనుల్లో చాలా సార్లు ఉంగరం తీయాల్సి వస్తుందని, అందువల్ల కొన్ని సందర్భాల్లో రింగ్ ధరించడం మరిచిపోవడం పూర్తిగా సహజమని వివరించారు. ఈ వివరణతో జేడీ వాన్స్–ఉషా చిలుకూరి విడాకుల రూమర్లకు తాత్కాలికంగానైనా ముగింపు లభించినట్టుగా తెలుస్తోంది.

     

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Priyanka Mohan : తణుకులో స్వయంభూ కపర్దేశ్వర స్వామి దర్శించిన నటి ప్రియాంక మోహన్
    తర్వాత ఆర్టికల్
    New Delhi: మహాభారత కాలం హస్తినాపురం – ఢిల్లీ కాదు, ఇది నిజమైన చోటు

    సంబంధిత అంతర్జాతీయం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి