శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    us green card interview arrests : అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్లపై నిఘా పెంపు: ట్రంప్ కొత్త విధానం అమల్లో

    4 రోజులు క్రితం

    ఇంటర్నెట్‌డెస్క్:  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ కార్డు హోల్డర్లపై కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వైట్ హౌస్ దగ్గర్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన తర్వాత దేశ భద్రతపై తీవ్రంగా కంగుపడ్డ ట్రంప్, శాశ్వత నివాస హక్కు ఉన్నవారిపై నిఘా పెంపు చర్యలు ప్రారంభించారు.  అమెరికాలో శాశ్వత నివాసానికి జారీ అయిన గ్రీన్ కార్డు హోల్డర్లను ఇంటర్వ్యూకు పిలిపించి, తేడాగా కనిపిస్తే భద్రతాధికారులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా శాన్ డియాగోలోని యూఎస్ సిటిజన్‌షిప్ & ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయంలో గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన వ్యక్తి మరియు అతని అమెరికన్ భాగస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  అమెరికాలోని ఒక లాయర్ వెల్లడించినట్లుగా, ఇంటర్వ్యూకి వచ్చిన తన అయిదుగురు క్లయింట్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఎలాంటి నేర చరిత్ర లేదని, వీరిద్దరూ యూఎస్ పౌరులతో వివాహం చేసుకున్నవారని వివరించారు.

     

    వీసా గడువు ముగిసినవారినే లక్ష్యం

    ఈ అరెస్టులు ప్రధానంగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నట్టుగా, దేశ భద్రత, జాతీయ మరియు ప్రజా భద్రతకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్నవారిని ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం అరెస్ట్ చేసి, నిర్బంధించడం జరుగుతుందని వారు స్పష్టంచేశారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Scrub typhus : ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి
    తర్వాత ఆర్టికల్
    Pickles in Plastic Containers : ప్లాస్టిక్‌లో ఊరగాయలను నిల్వ చేయడం ఎందుకు ప్రమాదకరం?

    సంబంధిత అంతర్జాతీయం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి