kntv
kntv

మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా వివాహం

16 minutes ago

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమా రుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. వియత్నాంలోని ఫూ క్వోక్ ద్వీపంలో ప్రకృతి అందాల నడుమ ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాలేజీ రోజుల నుంచే పరిచయమైన వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.