kntv
kntv

వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి . ఘనంగా నివాళులు

1 hour ago

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్‌తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల కూడా ఘాట్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుష్పాంజలి ఘటించారు.