kntv
kntv

వైఎస్సార్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి

1 hour ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవలు, విద్యా ప్రోత్సాహంలో వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవ నేటికీ కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.