kntv
kntv

ధోనీ బర్త్‌డే.. రక్తదాన శిబిరంతో అభిమానుల వేడుక

1 hour ago

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ధోనీపై తమ అభిమానాన్ని సమాజ సేవతో చాటుతూ పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.