kntv
kntv

వైఎస్సార్ జయంతి.. కన్నబాబు ఘన నివాళులు

1 month ago

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘన నివాళులు అర్పించారు. నాయకుడు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. తెలుగునాట రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్సార్ ముద్ర సజీవంగా ఉంటుందని, రాజకీయాల్లో ఆయన ఓ బ్రాండ్ అని కొనియాడారు.