శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Assam CM Himanta Biswa Sarma : జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు

    1 week ago

    గౌహతి, తేదీ: 25 నవంబర్ 202 5: ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ వేదికపై సీఎం హిమంత బిస్వా శర్మ జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించకపోయారని, ఆయనను హత్య చేశారంటూ సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. గతంలోనూ మీడియా ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ సారి శాసన సభలో ఈ వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది. మంగళవారం అస్సాం అసెంబ్లీలో జుబీన్ గార్గ్ మరణంపై చర్చ కోసం ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

    ఇకగా, జుబీన్ గార్గ్ మరణంపై దర్యాప్తు నిర్వహిస్తున్న ఏకసభ్య కమిషన్ కూడా సాక్ష్యాలను సమర్పించడానికి మరియు వాంగ్మూలాలు నమోదు చేసుకునే గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించింది. గౌహతి హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలోని కమిషన్, నవంబర్ 3న విచారణ ప్రారంభించింది.

    జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే, ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అస్సాం ప్రభుత్వం ఈ సంఘటనకు సంబంధించి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి, విచారణను ముమ్మరం చేసింది. ఏకసభ్య కమిషన్ నవంబర్ 21న సమర్పించాల్సిన నివేదిక గడువును పొడిగిస్తూ, డిసెంబర్ 12 వరకు దర్యాప్తు కొనసాగించనుందని ప్రకటించింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Gas savings tricks : వంట గ్యాస్ ఖర్చు పెరుగుతున్న పరిస్థితిలో ఆదా చేయడానికి సులభ చిట్కాలు
    తర్వాత ఆర్టికల్
    ap heavy rains warning : ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలకు తుఫాన్ హెచ్చరిక, రైతులు-మత్స్యకారులు అప్రమత్తం కావాలి

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి